NATS ChaptersX
NATS Global
Help Line: +1-888-4-TELUGU (+1-888-483-5848)
Latest Updates
- NATS LA Chapter Presents chess tournaments
- వరల్డ్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలికుటర్ భాను ప్రకాశ్‌తో ఓం సాయి బాలాజీ ఆలయం న్యూ జెర్సీ తో సంయుక్తంగా నాట్స్ వెబినార్
- NATS_LA_Chapter_Science_of_Meditation
- NATS Houston Men's Single Tennis Tournament 2021
- NATS Sevalu in COVID Period
- తెలుగు వ్యక్తి మసూద్ అలీ గుండెపోటుతో హఠాన్మరణం
- NATS expresses deepest condolences on the sad demise of PadmaBhushan, Legendary Shri. S.P. Balasubramanyam Garu
- Media Coverage-వరల్డ్ ఫాసెస్ట్ హ్యుమన్ క్యాలిక్యులేటర్ నీలకంఠ భాను ప్రకాష్‌తో నాట్స్ వెబినార్
- Tennis Doubles Tournament Success Coverage in Media
- NATS Congratulates BCCI Selection committee chairman MSK-Prasad
- నాట్స్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి @ NATS Bay Area
- NATS FREE Health Camp in New York
- నాట్స్ సంబరాలు ఫండ్ రైజింగ్ కు విశేష స్పందన
- Los Angeles Children’s Day Celebrations- Grand Success
- Judgement in Tri valley university scam
- St Louis celebrates Republic Day
- NATS Keeravani Event in New Jersey Became a Resounding Success
- NATS expansion across America, California- Bay area chapter inaugurated
- Mahila Sambaralu in Los Angeles
- NATS Helpline-Cyclone Hudhud Relief-Please Donate
- NATS acitivites in LA,Bay Area
News
-
Mar 01, 2021 NATS_LA_Chapter_Science_of_Meditation
ధ్యానంపై నాట్స్ ఆన్ లైన్ ద్వారా అవగాహన
ధ్యానం ప్రాముఖ్యత వివరించిన పత్రీజీ
లాస్ ఏంజిల్స్ ధ్యానంపై అవగాహన కల్పించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ధ్యానంపై ఆన్లైన్ ద్వారా అవగాహన సదస్సు నిర్వహించింది. నాట్స్ లాస్ ఏంజిల్స్ విభాగం ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు ఆధ్యాత్మిక మహా శాస్త్రవేత్త విశ్వ గురువు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రీజీ స్వామి ఆన్లైన్ ద్వారా అనుసంధానయ్యారు. ధ్యానం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ధ్యానం ఎందుకు చేయాలి..? ధ్యానం మనల్ని ఎలా శక్తిమంతులుగా తీర్చిదిద్దుతుంది. మనస్సును ఎలా నియంత్రణలో ఉంచుతుంది..? ధ్యానం ఎలా చేయాలి..? ఇలాంటి అంశాలపై ఆన్ లైన్ ద్వారా అవగాహన కల్పించారు. ధ్యానం మనిషిని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎలా తీసుకెళ్తుందనేది పత్రీజీ వివరించారు.హింస నుండి అహింస వైపు…. ధ్యానం మనల్ని ఎలా మళ్లిస్తుంది.? అజ్ఞానం నుండి ఆత్మజ్ఞానం వైపు..మానవత్వం నుండి దైవత్వం వైపు ధ్యానం నడిపిస్తుందని పత్రీజీ సవివరంగా చెప్పుకొచ్చారు. ఆన్లైన్ ద్వారా అనుసంధానమై.. ప్రశ్నలు అడిగిన వారికి సమాధానాలు ఇచ్చారు. ఆధ్యాత్మికత, ధ్యానానికి సంబంధించిన ఎన్నో సందేహాలను పత్రీజీ నివృత్తి చేశారు. ఈ ఆన్ లైన్ కార్యక్రమానికి రాజ్యలక్ష్మి చిలుకూరి వ్యాఖ్యతగా వ్యవహరించారు. నాట్స్ లాస్ ఏంజిల్స్ సమన్వయకర్త శ్రీనివాస్ చిలుకూరి, సంయుక్త సమన్వయకర్త మనోహర్ మద్దినేనితో పాటు శంకర్ సింగంశెట్టి తదితర నాట్స్ నాయకులంతా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. సునీత సింగంశెట్టి, శారద, మురళి ముద్దనా, సుధాకర్ మారేం, రామ్ బిక్కుమళ్ల, కిరణ్ ఇమ్మిడిశెట్టి, పరి పత్రి, శ్రీకాంత్ గార్ల, నర్సింహా పామిడి, సోహాన దొడ్లే, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా చాలా మంది తెలుగువారు ధ్యానంపై ఉన్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఆద్యంతం ఈ కార్యక్రమం ఎంతో ఉపయుక్తంగా, ఆసక్తికరంగా జరిగిందని ఇందులో పాల్గొన్న తెలుగువారు హర్షం వ్యక్తం చేశారు.