Back

NATS Global

Help Line: +1-888-4-TELUGU (+1-888-483-5848)

News

News

  • NATS LA Chapter Presents chess tournaments

    లాస్ ఏంజిల్స్‌లో నాట్స్ చదరంగం పోటీలు

     

    అంతర్జాల వేదికగా నాట్స్ లాస్ ఏంజెల్స్ చాప్టర్ లో చదరంగం పోటీలు

     

    టోర్నమెంటుకు విశేష స్పందన

     

    లాస్ ఏంజెల్స్: మార్చ్ 16:  అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా చెస్ టోర్నమెంట్ నిర్వహించింది. నాట్స్ లాస్ ఏంజెల్స్ విభాగం ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన ఈ చెస్ టోర్నమెంట్‌కు అనూహ్యమైన స్పందన లభించింది.

     

    విద్యార్థులలో సృజనాత్మకతను, ఏకాగ్రత, జ్ఞాపక శక్తిని పెంపొందించేందుకు నాట్స్ ఈ చెస్ టోర్నమెంట్ నిర్వహించింది. ఈ  చదరంగం  టోర్నమెంట్ కోసం అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లోని తెలుగు విద్యార్ధులు దాదాపు 250 మందికిపైగా మేముసైతం అంటూ ఈ పోటీల్లో పాల్గొన్నారు.ఆన్‌లైన్ వేదికగా రెండు రోజుల పాటు ఈ పోటీలు జరిగాయి. 

    చెస్ టోర్నమెంట్‌ దిగ్విజయం చేయడంలో నాట్స్ లాస్ ఏంజెల్స్ సమన్వయకర్త 

    చిలుకూరి శ్రీనివాస్, సంయుక్త సమన్వయకర్త మనోహర్ మద్దినేనిలు కీలక పాత్ర పోషించారు. నాట్స్ చెస్ పక్కా ప్రణాళిక బద్ధంగా నిర్వహించడంలో  స్పోర్ట్స్ చైర్ దిలీప్ సూరపనేని, స్పోర్ట్స్ టీం సభ్యులు కిరణ్ ఇమిడిశెట్టి, తిరుమలేశ్ కొర్రంపల్లి, రామకృష్ణ జిల్లెలమూడి, చెస్ మాస్టర్ రితీష్ మాథ్యూలు తమ వంతు కృషి చేశారు. నాట్స్ వాలంటీర్స్  శంకర్ సింగంశెట్టి, కరుణానిధి ఉప్పరపల్లి, మురళి ముద్దనా, గౌతమ్ పెండ్యాల, బిందు కామిశెట్టి తదితరులు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం  చేందుకు తమ మద్దతు అందించారు. వారాంతములో ఈ చెస్ పోటీలు పిల్లలకు ఎంతో ఉపయుక్తంగా, ఆసక్తికరంగా జరిగాయని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

    బోడపాటి చెస్ టోర్నమెంట్‌లో పాల్గొన్న విద్యార్థిని, విద్యార్ధులకు  ప్రశంసాపత్రాలు, విజేతలకు బహుమతులు అందజేస్తామని నాట్స్ ప్రెసిడెంట్ శేఖర్ అన్నే, నాట్స్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ మధు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన లాస్ ఏంజెల్స్ నాట్స్ బృందాన్ని నాట్స్ జాతీయ నాయకత్వం అభినందించింది.