Back

NATS Global

Help Line: +1-888-4-TELUGU (+1-888-483-5848)

News

News

  • NATS acitivites in LA,Bay Area

    North Americal Telugu Sangham (NATS) which is a unifying force of Telugus in US is expanding its activities in different parts of America. NATS, which has successfully conducted Telugu Sambaralu on a grand scale received tremendous appreciation from non-resident telugus across America.

    Recently, NATS has started its new chapter in California Bay area where majority of telugu people live. Thousands of telugus evinced keen interest in joining and participating in NATS programmes. Silicon Andhra also welcomed the formation of new chapter of NATS and congratulated it for preserving unity among telugus across America. NATS president Ravi Madala explained about the service oriented programmes of NATS for telugus in US. He complimented Shyam Jagarlamudi, who is striving for the unity of telugu people in Bay area. He appreciated the efforts of Shyam in launching NATS Bay area chapter. Ravi Madala congratulated the team consisting of Sambaiah Jagarlamudi, Rajasekhar Rao Jakalleti, Suman Ramayanam, Raghu Malladi, Ravi Panja, Hari Reddy, Satish Ravula, Vijay Gopineedu, Divya Tangella, Roopesh Gundupalle, Prasanth Banooru, Giriprasad Pachchametla, Fasi Qurram, Srinivas Babu Jagarlamudi, Ranadheer Gulakanti, Swaroop Landa, Venkat Koduri, Venkat Bollineni and others.

    *** అమెరికా అంతటా విస్తరిస్తున్న నాట్స్ ***కాలిఫోర్నియా – బే ఏరియా చాఫ్టర్ ప్రారంభం***

    July 27: బే ఏరియా: అమెరికాలో తెలుగు జాతిని ఏకం చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన పరిధిని మరింత పెంచుకుంటుంది.. అంగ రంగ వైభవంగా నాట్స్ మూడవ అమెరికా తెలుగు సంబరాలను నిర్వహించిన నాట్స్ కు ఇప్పుడు ప్రవాసాంధ్రులు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా కాలిఫోర్నియాలోని బే ఏరియాలో నాట్స్ తన కొత్త ఛాప్టర్ ప్రారంభించింది.. తెలుగువారు వేల సంఖ్యలో ఉన్న ఈ ప్రాంతంలో నాట్స్ లో చేరేందుకు వారెంతో ఉత్సాహం చూపించారు. సిలికానాంధ్ర కూడా కొత్త చాఫ్టర్ ప్రారంభాన్ని స్వాగతించింది. అమెరికాలో తెలుగువారిని ఏకం చేస్తున్న నాట్స్ ను అభినందించింది. నాట్స్ ప్రెసిడెంట్ రవి మాదాల అమెరికాలో ఉండే తెలుగువారికి నాట్స్ తరపున చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. బేఏరియాలో తెలుగు వారి ఐక్యత కోసం పాటుపడుతున్న శ్యాం జాగర్లమూడిని ఆయన అభినందించారు. నాట్స్ బే ఏరియా చాఫ్టర్ ప్రారంభానికి శ్యాం జాగర్లమూడి చేసిన ప్రయత్నాలను కూడా రవి మాదాల ప్రశంసించారు.

    సాంబయ్య జాగర్లమూడి , రాజశేఖర్ రావు జకేల్లేటి, సుమన్ రామాయణం,రఘు మల్లాది,రవి పంజా, హరి రెడ్డి, సతీష్ రావుల, విజయ్ గోపినీడు , దివ్య తంగెళ్ల, రూపేష్ గండుపల్లి, ప్రశాంత్ బానూరు, గిరిప్రసాద్ పచ్చమట్ల, ఫసి కుర్రం, శ్రీనివాస్ బాబు జాగర్లమూడి, రణధీర్ గులకంటి, స్వరూప్ లండ , వెంకట్ కోడూరి, వెంకట్ బొల్లినేని లతో ఏర్పడిన టీం ను రవి మాదాల అభినందించారు. బే ఏరియాలో తెలుగువారి కోసం చేపట్టే ఏ కార్యక్రమానికైనా నాట్స్ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు.

    ***అలరించిన కీరవాణి సంగీత విభావరి***

    కాలిఫోర్నియా. బే ఏరియాలో స్వరవాణి కీరవాణి పాటల ప్రవాహం హోరెత్తింది. యువ గాయనీ గాయకులు మధుర గీతాల నుంచి లేటేస్ట్ పాస్ట్ బీట్ ల వరకు అన్ని రకాల పాటలతో బే ఏరియా లో తెలుగు వారికి సంగీత మధురిమలు పంచారు. దాదాపు రెండు వేల మందికిపైగా తెలుగువారు ఈ సంగీతవిభావరిలో పాలుపంచుకున్నారు. నాట్స్ ఆధ్వర్యంలో జరిగిన సంగీత విభావరి ఆద్యంతం అందరిని ఆకట్టుకుంది. నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ వీరయ్య చుండు, ప్రసాద్ పాపుదేశి, గిరి కల్లూరి , రాజేష్ చిలకూరి , శ్రీనివాస్ భీమునివిజయ్ చావాసుమన్ ఇలా ఎందరో నాట్స్ ప్రతినిధులు ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అయ్యేందుకు తమవంతు సహకారం అందించారు. స్థానిక తెలుగు సంఘం సిలికానాంధ్ర తమ సంఘీభావం తెలిపింది

    *** ఉచిత వైద్యశిబిరాలకు నాట్స్ అండ*** భాషే రమ్యం.. సేవే గమ్యం నినాదంతో ముందుకెళ్లే నాట్స్… బే ఏరియాలో కూడా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టబోతోంది. రఘు మల్లాది, రవి పంజాలు ఈ ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటుకు సమన్వయ కర్తలుగా వ్యవహారిస్తారని నాట్స్ తెలిపింది.