Back

Dallas

Help Line: +1-888-4-TELUGU (+1-888-483-5848)

News

  • వరల్డ్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలికుటర్ భాను ప్రకాశ్‌తో ఓం సాయి బాలాజీ ఆలయం న్యూ జెర్సీ తో సంయుక్తంగా నాట్స్ వెబినార్

    వరల్డ్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలికుటర్ భాను ప్రకాశ్‌తో  ఓం సాయి బాలాజీ ఆలయం న్యూ జెర్సీ తో సంయుక్తంగా  

    నాట్స్ వెబినార్ 
    తెలుగు విద్యార్ధులకు మ్యాథ్స్ చిట్కాలు చెప్పిన భాను ప్రకాశ్
    టెంపాబే: ఫ్లోరిడా: మార్చ్ 10:  అమెరికాలోని తెలుగు విద్యార్ధుల్లో స్ఫూర్తిని నింపేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా  వరల్డ్ ఫాసెస్ట్ హ్యుమన్ క్యాలిక్యులేటర్ నీలకంఠ భాను ప్రకాష్ తో వెబినార్ నిర్వహించింది. నాట్స్ టెంపాబే విభాగం, ఓం సాయి బాలాజీ టెంపుల్ సంయుక్తంగా చేపట్టిన ఈ వెబినార్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఎంత పెద్ద లెక్కయినా చిటికెలో చెప్పేసే నీలకంఠ భాను ప్రకాష్ లెక్కల చిట్కాలను విద్యార్ధులకు వివరించారు. మ్యాథ్స్ ద్వారా మన మేథస్సును ఎలా పెంచుకోవచ్చు..? మన మానసిక సామర్థ్యాన్ని పెంచుకోవడంలో మ్యాథ్స్ ఎలా ఉపయోగపడుతుందనేది ఈ వెబినార్‌లో నీలకంఠ భాను ప్రకాష్ వివరించారు. ప్రవాస తెలుగు విద్యార్ధులు అడిగిన అనేక ప్రశ్నలకు భాను ప్రకాశ్ సమాధానాలు చెప్పారు. లెక్కలను సులువుగా ఎలా చేయాలనేది వివరించారు. ఈ వెబినార్‌లో  దాదాపు 500 మందికిపైగా విద్యార్ధులు పాల్గొన్నారు. ఎంతో ఆసక్తికరంగా సాగిన ఈ వెబినార్ విద్యార్ధులకు చాలా ఉపయుక్తంగా ఉందని విద్యార్ధుల తల్లిదండ్రులు తెలిపారు. ఇదే స్ఫూర్తితో నాట్స్ మార్చి 14న "మీలో కంప్యూటర్‌ను ఎలా ఆన్ చేయాలి" మార్చి 21న "గణితానుభవం" మార్చి 28 న "ప్రత్యామ్నాయ గణిత సంస్కృతి"  వెబినార్స్‌ను నాట్స్ నిర్వహించనుంది. 
    ఈ వెబినార్ నిర్వహణలో నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుతికొండ, నాట్స్ బోర్డు కార్యదర్శి ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ఉపాధ్యక్షుడు (ఫైనాన్స్‌,మార్కెటింగ్) శ్రీనివాస్ మల్లాది, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్  రాజేష్ కాండ్రు, నాట్స్ ఎగ్జిక్యూటివ్ వెబ్ సెక్రటరీ సుధీర్ మిక్కిలినేని, నాట్స్ టెంపా బే విభాగం సమన్వయకర్త  ప్రసాద్ ఆరికట్ల,  నాట్స్ టాంపాబే చాప్టర్ జాయింట్ కోఆర్డినేటర్ సురేశ్ బొజ్జ, నాట్స్ స్థానిక నాయకుల తో పాటు ఓం శ్రీ సాయి బాలాజీ ఆలయానికి చెందిన సూర్యనారాయణ మద్దుల, వంశీ తమ్మన, విశాలి ఈ వెబినార్ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.
     
    ఈ వెబినార్‌కు మద్దతు అందించిన నాట్స్ బోర్డు ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ అధ్యక్షుడు విజయ్ శేఖర్ అన్నే, నాట్స్ నాయకులు రవి గుమ్ముడిపూడి, శ్రీనివాస్ కాకుమాను, రంజిత్ చాగంటి లకు నాట్స్ టెంపాబే విభాగం కృతజ్ఞతలు తెలియజేసింది.