Back

NATS Global

Help Line: +1-888-4-TELUGU (+1-888-483-5848)

News

News

  • St Louis celebrates Republic Day

    సెయింట్ లూయిస్ లో ఘనంగా రిపబ్లిక్ వేడుకలు రెండు రోజులపాటు నాట్స్ మిస్సోరి విభాగం ఆధ్వర్యంలో వేడుకల నిర్వహణ

    ఏ దేశమేగినా..ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతి ని అంటూ, అమెరికాలో ప్రవాసాంధ్రులు రిపబ్లిక్ డే వేడుకులను ఘనంగా జరుపుకున్నారు.. అమెరికాలోని తెలుగువారికి ఒక్కటి చేసే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ … ప్రవాసాంధ్రుల్లో దేశభక్తిని మేల్కోలిపే లా రిపబ్లికే డే వేడుకలు నిర్వహించింది..నాట్స్ మిస్సోరి చాఫ్టర్ సెయింట్ లూయిస్ లో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు దాదాపు 700 మందికి పైగా ప్రవాసభారతీయులు హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో మొదటి రోజు చిన్నారులకు విద్యాసంబంధ పోటీలు నిర్వహించారు. రెండో రోజు పూర్తిగా సాంస్క్రుతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. . దేశభక్తిని మేల్కొలిపే గీతాలు, కార్యక్రమాలతో సాగిన ఈ వేడుకలు ఆద్యంతం ఆహూతులను ఆకట్టుకున్నాయి. నాట్స్ మిస్సోరి స్టేట్ డైరక్టర్ శ్రీనివాస్ మంచికలపూడి నాయకత్వంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

    రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా నిర్వహించిన పోటీలకు అద్భుతమైన స్పందన లభించింది. దాదాపు 250 మంది విద్యార్ధులు పాల్గొన్నారు..స్పెల్ బీ, మ్యాథ్స్ బీ, వ్యాసరచన, చిత్రలేఖనం, చదరంగం క్విజ్, రోబోటిక్స్ తదితర విభాగాల్లో పోటీలు జరిగాయి. .పోటీల్లో విజేతలకు కార్యక్రమం చివర ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు.

    అమెరికాలో తెలుగువారికి సేవలందరిస్తున్న ప్రముఖులను కూడా గణతంత్ర వేడుకల్లో నాట్స్ మిస్సోరి విభాగం ఘనంగా సన్మానించింది. బ్రైట్ లైఫ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా పేదపిల్లలకు విద్యా సేవలందిస్తున్న డాక్టర్ పొలినేని సుబ్బారావు, యోగా గురు రామకృష్ణ దేవరకొండ, వేద గణిత పండితులు శ్రీనివాస్ నపురపు లను నాట్స్ ఘనంగా సత్కరించింది… నాట్స్ రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా చిన్నారులకు నిర్వహించిన పోటీలను సన్మాన గ్రహీతలు అభినందించారు..

     

    డాక్టర్ సుధీర్ అట్లూరి, నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ విజయ్ బుడ్డి, నాట్స్ ముస్సొరి సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి గుమ్మి, ఇందిరా గుమ్మిలు అతిథులను సన్మానించారు.. వాతావరణం అంతగా అనుకూలించక పోయినా.. ఈ రిపబ్లిక్ వేడుకలు ఘనంగా నిర్వహించడంలో తన వంతు పాత్ర పోషించిన స్థానిక తెలుగు సంఘానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. రెండు రోజుల పాటు శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ జాయింట్ సెక్రటరీ మోహన కృష్ణ మన్నవ ల మార్గదర్శకత్వంలో జగన్ వేజండ్ల, హరింద్ర గరిమెళ్ళ, శ్రీనివాస్ గుళ్ళపల్లి లు ఈ రెండు రోజుల వేడుకలను చక్కటి ప్రణాళికతో నిర్వహించారు.

    తెలుగు ప్రాముఖ్యత పై ఈ గణతంత్ర వేడుకల్లో వక్తలు ప్రముఖంగా ప్రస్తావించారు. తెలుగులో మాట్లాడాల్సిన అవసరాన్ని, తెలుగు భాష తియ్యదనాన్ని వారు, అనేక తెలుగు సామెతలతో వివరించారు. రేపటి తరానికి తెలుగు అవసరాన్ని, వ్యాఖ్యత లక్ష్మి గుళ్ళపల్లి తన ప్రసంగంలో తెలిపారు.

    వైఎస్ఆర్ కే ప్రసాద్, విజయ్ బుడ్డి, తడకమల్లి శ్రీనివాసరావు, సుధాకర్ రెడ్డి గుండం, శ్రీకాంత్ వాసిరెడ్డి, బాలాజీ గోవిందన్, మనూ పరుచూరి, భావన కాకర్ల, కల్యాణ్ వడ్డెంపూడి, సౌమ్య కాట్రాగడ్డ, సుధీర్ రెడ్డి వుయ్యూరు, శ్రీనివాస్ రెడ్డి మున్నంగి, గోరిప్రతి నాగ, రామ్ ప్రసాద్ ముల్లం, కృష్ణ ఘంటాజీ, అనిల్ సురవరపు, శ్రీనివాస్ చెరుకూరి, రఘు ఇరుకుల పాటి, శ్రీనివాస్ పర్వతనేని, రాజ్ ఓలేటి, సతీష్ ముంగుండి, సత్య చిగురుపాటి, వెంకట అభిలాష్,, గిరిధర్ గొట్టిపాటి, సింహాద్రి వెంకటేశ్వరరావు (ఎస్వీ), శ్రావణ్ రెడ్డి పత్తి, వెంకటేశ్వరరావు కాట్రగడ్డ, వెంకట్ చౌదరి తలశిల, శిరిష యలమంచిలి, వెంకట్ దగ్గుబాటి, శ్రీనివాస్ కోనేరు, శ్రీథర్ పాటిబండ్ల, గోపినాథ్ సోంపల్లి, శ్రీనివాస్ అట్లూరి, నంద కిషోర్, గోపి ఉప్పల, రాధా కృష్ణ రాయని, శ్రీనివాస్ బత్తుల, వెంకట్ బోడావుల, సురేన్ బీరపనేని, సురేష్, పవన్ కొల్ల, రవి రాజ్, సౌజన్య, లక్ష్మి, ఇందిరా గరిమెళ్ళ, నరేంద్ర దుక్కిపాటి, మాధవి వేజండ్ల, విజయ యలమంచిలి, సుష్మా చెక్కా, శ్రీనివాస్ పాలడుగు,కాంతా రావు మొదలైన వారెందరో.. ఈ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించడంతో తమ వంతు పాత్ర పోషించారు.

    స్థానిక ప్రముఖులు స్థానిక ప్రముఖులు డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ దండమూడి, చంద్రశేఖర్ రెడ్డి గుమ్మి, డాక్టర్ సుధీర్ అట్లూరి, రజనీకాంత్ గంగవరపు తదితరులు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు

    ఈ వేడుకల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి శ్రీనివాస్ మంచికలపూడి కృతజ్ఞతలు తెలిపారు.. ఇదే ఉత్సాహంతో మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు.

    https://plus.google.com/photos/104674742892410385723/albums/5838717951039057377?banner=pwa

    NORTH AMERICA TELUGU SOCIETY